సంగారెడ్డి, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ): సంగారెడ్డిలో కలెక్టర్ కు బదులుగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్ పద్మజారాణి, ఆర్డీఓ రవీంద్రారెడ్డిలు స్వాగతం పలికారు. కాగా తనకు ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ స్వాగతం పలకనందుకు అసహనం వ్యక్తం చేశారు.
బీసీ కమిషన్ సభ్యులను స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ రావాలి కదా.? ఎందుకు రాలేదంటూ చైర్మన్ నిరంజన్ అక్కడికి వచ్చిన అధికారులను ప్రశ్నించారు. బీసీ కమిషనర్ అంటే అంత అలుసా.. తమాషాగా ఉందా..? అంటూ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ బహిరంగ విచారణలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులకు ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ రిసీవ్ చేసుకోవాలి. కలెక్టర్ బీసీ కమిషన్ కు అవమానం కలిగించారని, దీని పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.