తెలంగాణ ప్రజలను అగ్రవర్ణాల పాలన నుంచి విముక్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని… అందుకే బీసీ సీఎం ప్రకటన అని కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ పేర్కొన్నారు… రాజకీయంగా పేద వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించిన బీజేపీ… ఇప్పుడు వారి చేతికి అధికారం అప్పగించేందుకు సిద్ధమైందన్నారు. బీసీ నేత ముఖ్యమంత్రి అయితే వారి సమస్యలు తెలుస్తాయని… పేదలకు మేలు జరుగుతుందని తెలంగాణ సమాజం విశ్వసిస్తోంది. ప్రజల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో వివిధ ప్రాంతాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని సంజయ్ అన్నారు. ప్రజల మధ్యకు వెళ్తున్నందున ఓటర్ల మనోభావాలు ఏంటో అర్థమవుతోందన్నారు. అయితే కరీంనగర్ లో స్థానిక మంత్రి గంగుల కమలాకర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్ నాయకులను కొనడానికి సిధ్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ గెలవకున్నా కాంగ్రెస్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారని మండిపడ్డారు..
బీఆర్ఎస్ కరీంనగర్ నాలుగవ స్థానంలో ఉంటుందన్నారు. వ్యతిరేకత ఓటు చీల్చే ప్రయత్నం చేయకండి,బిజేపి కి మద్దతు ఇవ్వండన్నారు. కరీంనగర్ లో అన్ని వర్గాల ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ ని నాశనం చేసిందే గంగుల కమలాకర్ కంపెనీ ఆంటూ ఆరోపణలు గుప్పించారు.