అసెంబ్లీలో భట్టి, హరీష్ లు ఢీ అంటే ఢీ
అన్ని విధాలా ప్రభుత్వ దోకా చేసిందంటూ హరీశ్ ఆగ్రహం
అన్ని రంగాలకు కేటాయింపులు చూసి
ఈర్షతోనే బిఆర్ఎస్ విమర్శలన్న భట్టి
పదేళ్లు తెలంగాణకు దోకా చేసింది కేసిఆర్ అంటూ ఎన్ కౌంటర్
అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలు హాట్ హాట్ సాగాయి..ఇటు విపక్షం ,అటు అధికారం పక్షం రెండు కూడా కౌంటర్ , ఎన్ కౌంటర్ లు వేస్తూ సభను వేడి పుట్టించాయి.. ఉప మఖ్యమంత్రి భట్టి,హారీష్ రావుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది..
ఇక శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా తొలుత హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ టార్గెట్‌గానే బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు. ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఫైర్ అయ్యారు. ఎనిమిది నెలలో ప్రభుత్వం ఎన్ని పథకాలకు మంగళం పాడిందో దోకా అంటూ వివరించారు హరీష్ రావు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా ఇచ్చిందంటూ మండిపడ్డారు.
8 నెలల్లో ఎన్ని ధోకాలు అధ్యక్షా!?
ప్రతి మహిళలకు నెలకు 2500- దోకా..
రైతు భరోసా కింద రైతన్నకు, కౌలు రైతుకు 15 వేలు -దోకా…
డిసెంబర్ 9 న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ – దోకా. .
అన్ని పంటలకు మద్దతు ధరపై 500 బొనస్ -దోకా.
విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు -దోకా.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ -దోకా.
25 వేల పోస్టులలో మెగా డిఎస్సీ – దోకా.
వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు -దోకా.
నిరుద్యోగ భృతి -దోకా.
వెంటనే డిఏ, పిఆర్సి ఇస్తామని ప్రభుత్వ, ఉద్యోగులు ఉపాధ్యాయులకు -దోకా.
ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం -దోకా.
మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ -దోకా.
అవ్వా, తాతలకు 4వేల ఫించన్ -దోకా.
దివ్యాంగులకు 6వేల పింఛన్ -దోకా.
కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం -దోకా.
ఆటో డ్రైవర్లకు 12 వేల ఆర్థిక సాయం -దోకా.
ప్రతి రోజూ సీఎం ప్రజాదర్బార్ -దోకా.
దోకా., దోకా.,దోకా.… కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకా పార్టీ నే డోకా అంటూ హరీశ్ రావు విమర్శలు గుప్పించారు..
దీనిపై డిప్యూటీ సీఎం భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావుకు బడ్జెట్ అంటే కంటగింపులా ఉందన్నారు. ఎంత దొరికితే అంత దోచుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్‌ది అన్నారు.
హరీశ్ రావు స్పందిస్తూ.. మద్యంపై రూ.7వేల ఆదాయం పెరుగుతుందని బడ్జెట్‌లో తెలిపారని ఎలా పెరుగుతుందో చెప్పాలని కోరారు. మద్యం ధరలు పెంచి ఈ ఆదాయం సమకూర్చుకుంటారా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచడం అంటే మద్యాన్ని ప్రోత్సహించడమే కదా అన్నారు.
భట్టి రిప్లై ఇస్తూ.. ‘టానిక్’ లాంటి మద్యం షాపులు పెట్టి ప్రభుత్వ ఆదాయాన్ని రాకుండా కొద్ది మంది కుటుంబాల చేతుల్లో బీఆర్ఎస్ నాయకులు పెట్టారన్నారు. ఆ ఆదాయం మొత్తం రాష్ట్రానికి తిరిగి వచ్చేలా చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. దీనిపై ప్రభుత్వంలో మీరే ఉన్నారని కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మద్యంపై ఆక్షన్ ఈ ఆర్థిక సంవత్సరానికి పెట్టాల్సి ఉండగా గతేడాదే ఎలక్షన్ ముందు పెట్టారని భట్టి గత ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.
ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, సాగునీటి ప్రాజెక్ట్ లకు ,సంక్షేమ పథకాలకు, చివరకు హైదరాబాద్ అభివృధ్దికి తామ కేటాయించిన నిధులు చూసి బిఆర్ఎస్ పార్టీ అసూయతోనే విమర్శలు చేస్తున్నదని భట్టి అన్నారు.. పదేళ్లో తెలంగాణ ప్రజలను ముంచి దోకా చేసింది కెసిఆర్ నంటూ మండిపడ్డారు.