Tuesday, November 19, 2024

ఆది పురుషుడు బసవేశ్వరుడు – ఎంపీ బీబీ పాటిల్

బాన్సువాడ, జూన్ 21 ప్రభ న్యూస్ – అన్ని మతాల సమానంగా భావించిన ఆది పురుషుడు బసవేశ్వరుడని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. బిచ్కుంద మండలం చెట్లూరు గ్రామంలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 12వ శతాబ్దంలో అన్ని కులాల మతాలకు సమానంగా భావించి శివుని అనుగ్రహంతో భక్తి మార్గంలో ఉండి సేవ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని భక్తి మార్గాన్ని చూపిన మహానీయుడని కొనియాడారు.

ప్రతి వ్యక్తి జీవితంలో ఆత్మ మనసుతో భగవంతుని స్మరించినప్పుడే కష్టాలు దూరమవుతాయని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో సెల్ఫోన్ వాడకం ఎక్కువ అవుతుందని, కనీసం రెండు నిమిషాలు పొద్దున లేవగానే భగవంతుని నామస్మరణ చేయడంతో పాటు ఇతరులను మంచి మనసుతో చూడాలని ఇతరుల మనుషులను బాధ పెట్టరాదని ఆయన అన్నారు. గురువు ద్వారానే భక్తి మార్గం దొరుకుతుందని ఆయన అన్నారు. అయ్యప్ప గుడి నుండి ద్విచక్రవాహనంపై చెట్లూరు వరకు ర్యాలీగా వచ్చి బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లింగాయత్ సమాజ్ కు చెందిన వక్తలు ఘనంగా సన్మానించారు.

ఈ సమావేశానికి గురువులు ఆశీర్వదించారు.
సోమలింగ శివాచార్య మహా స్వామీజీ సోమయ్య, ఖత్గాం మహారాజు మల్లికార్జున్ అప్ప, ఖాళీగా మహారాజు శంకర్ శివచార్య, కౌలాస్ మహారాజ్ మల్లికార్జునప్ప, బసవలింగప్ప. బిచ్కుంద మండలం ఎంపీపీ అశోక్ పటేల్, ఎక్స్ ఎమ్మెల్యే గంగారం, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement