Thursday, October 17, 2024

TS : బాస‌ర ట్రీపుల్ ఐటీలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల

బాస‌ర ట్రీపుల్ ఐటీలో ప్ర‌వేశాల కోసం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించి వర్సిటీ అధికారులు ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

www.rgukt.ac.in వెబ్‌సైట్, [email protected] ఇమెయిల్ ద్వారా సందర్శించాలని సూచించారు. ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్‌లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement