Friday, October 18, 2024

Basara : అమ్మవారి సన్నిధిలో సినీ ప్రముఖులు

బాసర ఆక్టోబర్ 13 (ఆంధ్రప్రభ ) ప్రసిద్ధ పుణ్య క్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆదివారం సినీ ప్రముఖులు దర్శించుకొని పూజలు చేశారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ళ భరణి , ప్రముకనిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా అలయనికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు అర్చకులు సాదర స్వాగతం పలికారు.అమ్మవారి సన్నిధిలో సినీ నటుడు తనికెళ్ళ భరణి తన మనవడికి అమ్మవారి చెంత అక్షరాబ్యాస పూజ ను జరిపించారు.

సినీ నిర్మాత దిల్ రాజు కుంటుంబ సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి కుంకుమార్చన పూజ జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆశీర్వచన మండపంలో సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి,దిల్ రాజు లను శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు.వీరి వెంట ఆలయ అధికారులు, సిబ్బంది వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement