Wednesday, October 2, 2024

Basara – సరస్వతి నమోస్తుతే! – రేప‌టి నుంచి శార‌దీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల

అక్టోబ‌ర్ 12 వ‌ర‌కు ఉత్స‌వాలు
శైల‌పుత్రి అవ‌తారంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, బాస‌ర : ప్రసిద్ధ పుణ్య క్షేత్రం, చ‌దువుల త‌ల్లి కొలువైన బాస‌ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో గురువారం నుంచి శార‌దీ శ‌ర‌న్న‌వ‌రాత్రులు ప్రాంభ‌మ‌వుతాయి. తొమ్మిది రోజుల‌పాటు నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌డానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ విజయరామరావు తెలిపారు.

తెల్ల‌వారు జాము నుంచే కార్య‌క్ర‌మాలు
బాస‌ర పుణ్య‌క్షేత్రంలో గురువారం తెల్లవారు జామున నాలుగు గంటలకు శ్రీ మహా లక్ష్మీ,శ్రీ మహా కాళీ, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేక, అర్చన, మంగళ వాయిద్య సుప్రభాత సేవలతో నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఉదయం 10 గంటలకు ఆలయ సన్నిధిలో విశ్వేశ్వర పూజ, క్షేత్ర పూజ , కలశ స్థాపన ఘటస్థాపనతో ఉత్సవాలను ఆరంభిస్తారు.

- Advertisement -

శైల పుత్రి అవతారంలో అమ్మవారు ద‌ర్శ‌నం
న‌వ‌రాత్రుల పురస్కించుకుని తొమ్మిది రోజులు అమ్మ‌వారు వివిధ రూపాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. తొలి రోజు శైల‌పుత్రి అవ‌తారంలో అమ్మ‌వారు భ‌క్త‌ల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్న‌ట్లు ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధానార్చకులు సంజీవ్ పూజారి తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన మండపంలో అమ్మవారి రూపాలను ఆలయ అర్చకులు నెలకొల్పుతారని పేర్కొన్నారు. ఈ సంర్భంగా విశేష పూజలు నిర్వహించి అమ్మవారికి కట్టే పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.

విద్యుత్ దీపాలతో అలంకరణ
నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారి సర్వ దర్శనానికి , 150 రూపాయల అక్షరాబ్యాస పూజలకు ఆలయ అతిథి గృహాల నుండి రహదారి పై పోలీస్ స్టేషన్ వైపు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆలయాల అతిథి గదుల వద్ద ప్రత్యేక రూ.1000 ల అక్షరాభ్యాస‌ పూజా, రూ.100 స్పెషల్ దర్శననికి క్యూ లైన్ ఏర్పాటు చేశారు.

ఆక్టోబర్ 9 న విశేష పూజ
అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్రమైన మూల న‌క్ష‌త్ర సంద‌ర్భంగా ఈ నెల 9న శ్రీ‌జ్ఞాన స‌ర‌స్వ‌తికి ప్ర‌త్యేక పూజ‌ల‌ను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. అదే రోజు అధిక సంఖ్యలో అక్షర అభ్యాస పూజలు జరిపించడానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సన్నిధిలో ప్రత్యేక దర్శన అక్షరాభ్యాస పూజ, క్యూలైన్ ఏర్పట్లు చేశారు. మూల నక్షత్రం శుభ ముహూర్తం సందర్భంగా ఆలయం తరపున చిన్నారులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు పంపిణీ చేయ‌నున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను దేవాదాయశాఖ తరపున ప్ర‌భుత్వం అంద‌జేస్తుంది.

ఉచిత అన్నప్ర‌సాదం
దేవి నవరాత్రులు సందర్భంగా నాందేడ్ బాబాజీ జగదీష్ మహరాజ్, దేవస్థానం తరపున భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ చేయనున్నరు. భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదం అందేలా ఆల‌య అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఆన్లైన్ లో రూ.1000 టెక్క‌ట్ల అందుబాటు
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రూ.1000 ల అక్షరాభ్యాస పూజ టికెట్లను అందుబాటులో ఉంచారు. టిపోలియో అప్ ద్వారా ఆన్లైన్‌లో బుక్ చేసుకోవ‌చ్చ‌న‌ని ఆల‌య అధికారులు తెలిపారు. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

భారీగా పోలీస్ బందోబస్తు
దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ జిల్లా ఎస్పీ జానికి షర్మిల ఆదేశాల మేరకు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement