Sunday, October 6, 2024

Basara – కుష్మండా అవతారంలో బాసర జ్ఞాన సరస్వతి

బాసర ఆక్టోబర్ 5 (ప్రభ న్యూస్) నిర్మల్ జిల్లా బాసర లోను చదువుల తల్లి కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా కొనసాగితున్నయి. ఆదివారం నాల్గవ రోజు అమ్మవారు కుష్మండా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మవారికి అర్చకులు విశేషంగా తమళార్చన నిర్వహించి అల్లం వడలు నైవేద్యంగా సమర్పించారు.వేకువజామున 5 గంటల నుండి అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు.

భక్తులు గోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో అభిషేక అర్చన పూజలు చేశారు.అనంతరం భక్తులు తమ చిన్నారులకు ఆలయంలోని అక్షరాబ్యాస మండపంలో అక్షరాబ్యాస పూజలు జరిపించి ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

అమ్మవారి సన్నిధిలోని నిత్యాఅన్నదన సత్రంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాల క్షేప మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థానం తరపున ఏర్పాటు చేశారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement