కామారెడ్డి, జూన్ 28 (ప్రభ న్యూస్):- కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు పాత జాతీయ రహదారి పైన బుధవారం జిల్లా పోలీసు శాఖ ఓఎస్డి అన్యోన్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కళాశాల ముందు విద్యార్ధుల రద్దీ దృష్ట్యా రహదారి వద్ద యాక్సిడెంట్లు జరిగకుండా ప్రిన్సిపాల్ డాక్టర్ కే. కిష్టయ్య విజ్ఞప్తి మేరకు రహదారి మీద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అన్యోన్య మాట్లాడుతూ, “కళాశాలలు ఉన్న ప్రాంతంలో భద్రతా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు, ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి ఉదయ్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ వినయ్ సాగర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఎం. చంద్రకాంత్, అధ్యాపకులు డాక్టర్ వి. శంకర్, లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి, జె. శివ కుమార్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, ఏ. లక్ష్మణాచారి, సత్య నారాయణ, స్వాతి, శ్రీలత, రాణి, సూపరింటెండెంట్ ఆంజనేయులు, నవీన్, మారుతి, గోవర్ధన్, హరీశ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.