బాన్సువాడ, ప్రభ న్యూస్ : రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..సీఎం కేసీఆర్ అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల భాగంగా బాన్సువాడ డివిజన్ లోని దేశాయిపేట గ్రామంలో రైతు దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సమావేశం దేశాపేట్ గ్రామంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అన్ని పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. డబల్ బెడ్ రూమ్ పథకంతో పాటు వచ్చే నెలలో మూడు లక్షల స్కీం ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ మంజూరు చేస్తామని ఆయన అన్నారు.
కేసీఆర్ కృషితో ఎంతో మందికి పెన్షన్లు సాగునీటి ప్రాజెక్టు, తాగునీటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, రైతు సంక్షేమ ప్రభుత్వం దినోత్సవ సందర్భంగా ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశాయిపేట సర్పంచ్ శ్రావణ్ కుమార్ శాసనసభాపతి .. మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ ఎంపీపీ నీరజ వెంకటరామిరెడ్డి, బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు పాత బాలకృష్ణ, కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.