Sunday, November 24, 2024

Delhi: ఓటుకు నోటు కేసు… విచార‌ణ జులైకు వాయిదా

మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు బ‌దిలీ కోరుతూ
మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫిటిష‌న్
రేవంత్ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌క‌పోవ‌డ‌తో
విచార‌ణ‌ను రెండు నెల‌ల‌కు వాయిదా
ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్‌‌లో జరిగేలా బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్‌ఎస్‌ నేతలు గుంతకండ్ల జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహ్మద్‌ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆ సమయంలో ఆదేశించింది.

- Advertisement -

కాగా, విచారణ సందర్భంగా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్ కు మాత్రమే ఎందుకు మార్చాలని పిటిషనర్ల తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ప్ర‌స్తుతం అక్క‌డ రేవంత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నార‌ని, కేసు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని న్యాయ‌వాదులు వివ‌ర‌ణ ఇచ్చారు.. కాగా, రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో కేసు విచారణ వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement