Monday, December 23, 2024

Bankers Review – పంట రుణాలందివ్వడంలో స్పీడ్ పెంచాలి : బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భ‌ట్టి సూచన

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : పంట రుణాల పంపిణీలో వేగ‌వంతం చేయాల‌ని, మ్యాచింగ్ గ్రాంట్లు, రాయితీ రుణాలు మంజూరు చేయ‌డంలో బ్యాంకులు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్ లో నేడు జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై భట్టి విక్రమార్క చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న‌ రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూడబోతున్నామని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

రైతుల‌కు స‌కాలంలో రుణాలు అంద‌క‌పోతే వృథే
ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ రైతులకు సకాలంలో రుణాలు అందకపోతే అది వృథా అని, రబీ పంట రుణాల పంపిణీలో వేగం పెంచి రైతులకు సకాలంలో రుణాలు అందించాలని బ్యాంకర్స్ కు సూచించారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు పిలుస్తామని, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయం సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

- Advertisement -

రైతుల ప్ర‌యోజ‌నాల దృష్టిలో ఉంచుకుని…
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పథకాల రూపకల్పన చేయాలని బ్యాంకర్లకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన డ్రోన్లను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన ప్రాజెక్టును బ్యాంకర్లు సొంతంగా నిర్వహించేలా చేయాలని సూచించారు. బ్యాంకులపై ప్రజల్లో విశ్వాసం కోల్పోతే అది భవిష్యత్ కు నష్టం అన్నారు. బ్యాంకులు ఇచ్చిన అప్పులపై అజమాయిషీ లేకుండా పోయిందన్నారు. బ్యాంకు అప్పులను తిరిగి కట్టేవాళ్లు కడుతుంటే ఎగ్గొట్టేవాళ్లు ఎగ్గొడుతూనే ఉన్నారని దాంతో అర్థం లేకుండా పోతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement