హైదరాబాద్‌లోని బండ్లగూడ సీఐ మొహమ్మద్ షాకిర్ అలీ,ఎస్ఐ వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేష్‌లపై వేటు పడింది. వారి ముగ్గురిని మహిళా కానిస్టేబుల్ పిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -
కేసు దర్యాప్తులో అలసత్వం వహించారని మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుచేసిందన్నారు. దీనిపై విచారణ జరిపి వారి ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వలు జారీ చేసినట్లు చెప్పారు.