మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ‘మా’ ఎన్నికల బరి నుంచి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తప్పుకున్నారు. మా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తన ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సూచన మేరకు మా జనరల్ సెక్రటరీ నామినేషన్ ఉపసంహకరించున్నట్లు తెలిపారు.
మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో విష్ణు మధ్య పోటీ గట్టిగా ఉంది. ‘మా’ ఎన్నికలు అక్టోబరు 10న జరగనునున్నాయి. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి.