Friday, November 22, 2024

బండిసంజ‌య్.. ఖైదీ నంబర్ 7917

బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ లీక్ కేసులో ఏ1గా న‌మోద‌య్యారు.దాంతో బండి సంజయ్ ను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.. అనంతరం 14 రోజుల రిమాండ్ విధించిన ఆదేశాల ప్రకారం కరీంనగర్ జైలుకు తరలించారు. కరీంనగర్ జైల్లోని గోదావరి బ్యారక్ లో బండి సంజయ్ ను ఉంచారు.కాగా బండి సంజయ్ కు కరీంనగర్ జైల్లో ఖైదీ నంబర్ 7917ను జైలు అధికారులు కేటాయించా క కరీంనగర్ జైలుకు వచ్చిన బండి సంజయ్ ను రాత్రి ఆయన కుటుంబ సభ్యులు కలవడానికి వచ్చారు. అయితే పర్మిషన్ లేదని సంజయ్ ను కలవడానికి జైలర్ ఒప్పుకోలేదు. దీంతో నేడు ములాఖత్ కు బండి కుటుంబీకులు అప్లై చేసుకున్నారు. అనుమతి వచ్చాక సంజయ్ తో ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడనున్నారు.

బండి సంజయ్ ను కరీంనగర్ జైల్లో పెట్టడంతో బీజేపీ కార్యకర్తలు భారీగా జైలు దగ్గరకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంగర్ జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పదోతరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండిని కోర్టులో హాజరుపరచగా ఏకంగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పదోతరగతి పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో ఏ1గా బండి సంజయ్ .. ఏ2గా బూరం ప్రశాంత్ ను… ఏ3గా మహేష్.. ఏ4గా శివ గణేష్.. ఏ5గా మైనర్ బాలుడిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్లు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. బండి సంజయ్ నే పేపర్ లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement