Friday, November 22, 2024

Delhi: కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన బండి సంజ‌య్..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై వేద మంత్రోఖ్చరణలతో బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా సహచర మంత్రి నిత్యానంద రాయ్ బండి సంజయ్ కు పూలబొకే అందించి అభినందనలు తెలిపారు.

భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నుండి భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూలబొకేలు, శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి బండి సంజయ్ కు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజల రాకతో బండి సంజయ్ నివాసం కోలాహలంగా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement