సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను గొప్ప హిందువునని చెప్పుకుంటున్న కేసీఆర్.. ఈ భయంకర హిందువు తనయుడు కేటీఆర్ ఒక నాస్తికుడు అని అన్నారు. ముందు నీ కొడుకును భక్తుడిగా మార్చు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వార్థంతో యాగాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా నాస్తికులేనని చెప్పారు. అందుకే తెలంగాణలో హిందూ దేవుళ్లకి అవమానం జరుగుతోందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను ప్రజలు అడ్డుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. శక్తిమంతమైన, ప్రజాస్వామ్య విలువలు ఉన్న తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం అని చెప్పారు. వాజ్ పేయీ అడుగుజాడల్లో అందరూ నడుద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement