తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. నిన్న నల్గొండ జిల్లాలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆరెస్ భయపడుతోందని.. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత యుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తమపై దాడికి స్కెచ్ వేసినప్పుడే నిన్నటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే తలలు నరుకుతావా..? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్న బండి సంజయ్.. తమపై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా ? అని నిలదీశారు. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అవినీతి చిట్టా తీస్తామన్న ఆయన.. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: అమరావతి మహోద్యమం @ 700
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily