Tuesday, November 19, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సంచలన లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్న విచారణలో సమగ్రత, చిత్తశుద్ధి లోపించినట్లు కన్పిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ ప్రతిష్ట మసకబారింది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ప్రత్యేక హక్కులను మంట కలిపారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాశారని వెల్లడించారు.

భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడుకునే అంశాలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం ద్వారా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. విపక్షాల అణచివేత కోసం ఫోన్ ట్యాపింగ్ ద్వారా సైబర్ దాడికి తెగబడటం సహించరాని విషయం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియాకు లీకులివ్వడమే తప్ప అధికారికంగా ఏం జరుగుతుందో ఇప్పటి వరకు వెల్లడించకపోవడం చూస్తుంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణపై నెలకొన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. త‌మకు అందుతున్న సమాచారం ప్రకారం… రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసిందని లేఖ‌లో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement