Saturday, November 23, 2024

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 16వ రోజుకు చేరుకుంది. ఆదివారం మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ నుంచి కొల్చారం మండలం రంగంపేట వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర అనంతరం రంగంపేట సభ ఏర్పాటు చేశారు. ఇందులో బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొననున్నారు.

శనివారం జోగిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం ప్రజలు ఉద్యమం చేసి టీఆర్ఎస్​కు అధికారం కట్టబెడితే కేసీఆర్ కుటుంబమే రాజ్యమేలుతోందన్నారు. ఇంట్ల లొల్లి అయితే ఫాంహౌస్‌కు పోవడం.. అక్కడ బోర్ కొడితే మళ్లీ ప్రగతి భవన్ కు రావడం అలవాటైందన్నారు. ప్రధాని మోడీ 18 గంటలు పని చేస్తుంటే..  సీఎం కేసీఆర్ 4 గంటలు పనిచేసి 18 గంటలు పడుకుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ​మెడలు వంచి బందీగా ఉన్న తెలంగాణ తల్లిని విముక్తి చేస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్​ను ఎదుర్కొనే దమ్ము.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చి గొల్లకొండపై కాషాయ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న హుజూరాబాద్ ఉప ఉన్నికలో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్​ కూడా దక్కదని బండి సంజయ్ జోష్యం చెప్పారు. 

ఇది కూడా చదవండిః మెడిసిన్ ఫ్రం స్కై: డ్రోన్లతో ఔషధాల సరఫరా

Advertisement

తాజా వార్తలు

Advertisement