ఉమ్మడి మెదక్ బ్యూర్, మే 11 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర సాధనలో మిలియన్ మార్చ్ విధంగా చరిత్ర సృష్టించిందో ఇప్పుడు బాజాపా ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ మార్చ్ ఆ విధంగా చరిత్ర సృష్టించాలని బీజేపీ స్టేట్ ఛీప్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరుద్యోగ మార్చ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి ఐబీ నుండి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ర్యాలికి వేలాదిగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు, నిరుద్యోగులు తరలిరావడంతో సంగారెడ్డి జనసంద్రమైంది. అనంతరం కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ నయా నిజాం పాలనకు వ్యతిరేఖంగా, గడీలను బద్దలు కొట్టేందుకోసమే నిరుద్యోగ మార్చ్‌ను బీజేపీ చేపట్టిందని నిరుద్యోగ మార్చ్‌తో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోరారు. కుటుంబ పాలనను, అవినీతి పాలనను అంతమొందించేందుకు బీజేపీ విశ్రమించని పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీఎంపీలు విజయశాంతి, జితేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఆమోదింపచేస్తాం
బీజేపీ అధికారంలోకి వస్తే బిశ్వాల్ కమిటీ నివేధిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ నియమాక పక్రియను అమలుచేస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ్ స్పష్టంచేశారు. ప్రతి సంవత్సరం బాజ్ క్యాలెండర్ ను విడుదల చేసి జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా నియమాకాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని నిరుద్యోగ మార్చ్ సభనుద్దేశించి బండి సంజయ్ హమీనిచ్చారు.
మంత్రి కేటీఆర్ పై ఉద్వేగ భరితమైన ప్రసంగం
రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని అప్పటి వరకు బీజేపీ విశ్రమించని పోరాటం చేస్తుందన్నారు. నిరుద్యోగ మార్చ్ ఒకటి, రెండు రోజులు చేస్తారని కేసీఆర్ కుటుంబం కలలు కన్నదని కాని బీజేపీ వ్యూహం మార్చి రాష్ట్ర మంతటా నిరుద్యోగ మార్చు నిర్వహిస్తుండటంతో వణుకు మొదలైందన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీకి కారణమై, 30 లక్షల మంది యువకుల జీవితాల ఆగమయ్యేందుకు కారణమైన మంత్రి కేటీఆర్ మెడలు వంచాల్సిందేనని ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని బండి చేశారు.
కేసీఆర్ జిల్లాలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..?
కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్‌కు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ స్తభాస్థలిని ఉద్దేశిస్తూ ప్రశ్నించాడు. కేసీఆర్ జిల్లా కేసీఆర్ అల్లుడి జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.. ఒక్క ఉద్యోగమైనా సృష్టించాడా అంటూ ప్రశ్నించాడు. ఆ రోజు మిలియన్ మార్చ్ ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఎలాగైతే గద్దె దించిందో.. ఈనాడు బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరుద్యోగ మార్చ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. యువకులు ఈ సారి జరిగే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదు
కొట్లాడి సాధించుకు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని బండి సంజయ్ అన్నారు. అన్నివర్గాలు భాదపడుతున్నయని, ఉద్యోగులకు నిర్ణీత సమయంలో వేతనాలు రావడం లేదని, ప్రమోషన్లు ఇస్తలేరు,పోస్టింగ్ ఇస్తలేరు, 307 అమలుచేసి ఉసురుపోసుకుని చెట్టుకొకల్ని.. పుట్టకొకల్ని చేసి మా జీవితాలను ఆగమాగం చేసిండని ఉపాధ్యాయులు కన్నీరుపెట్టుకున్నారని గుర్తుకుచేశారు. రుణమాఫి చేస్తాడని ఆ మాటే మర్చిండని, అకాల వర్షాలు పడి పంటను నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదని ఆరోపించారు.
నిరుద్యోగ మార్చ్‌లో ఆ రెండు అంశాలే ప్రధానం:
తూతూ మంత్రంగా కొద్దిమందిని అరెస్ట్ చేసి పేపర్ లీకేజీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బండి ఆరోపించారు. సిట్ దర్యాప్తు నిందితులకు కొమ్ముకాయడానికే పనిచేస్తోందే తప్ప.. నివేదిక ఇచ్చిన దాఖలాల్లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌తో పాటు- బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ప్రజలు మార్పును కోరుకుంటు-న్నారని, బీజేపీ చేస్తున్న ఉద్యమాలను గమనిస్తున్నారని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే సత్తా బీజేపీకే ఉందని ప్రజలు భావిస్తున్నట్ల ధీమా వ్యక్తం చేశారు. ఆయా జిల్లాలకు ధీటు-గా ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని సూచించిన ఆయన.. ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ అడ్డా కావాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ -టె-లికాన్ఫరెన్స్‌లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి టి.వీరేందర్ గౌడ్, ఆకుల విజయ, దరువు ఎల్లన్న, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.