Saturday, November 16, 2024

న్యాయవాదులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

పెద్దపల్లి – న్యాయవాద దంపతుల హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు .పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీలో న్యాయవాదుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు…ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతల అక్రమాలపై కేసులు వేసినందుకు న్యాయవాద దంపతులను అతి కిరాతకంగా నరికి చంపారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయనేందుకు ఈ హత్యలే నిదర్శనమన్నారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని, హత్యతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మృతుల బంధువులకు బండి పరామర్శ…
అంతకు ముందు మృతి చెందిన న్యాయవాద దంపతుల కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంపీ వెంట మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు

హత్యలలో కుంట శ్రీను హస్తం..

హైకోర్టు న్యాయవాది  గట్టు వామన్ రావ్ దంపతుల హత్యలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నవి.గుంజపడుగులో ఒక గుడి వివాదమే హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. “కుల దేవత గుడి కూలితే వామన్ రావ్ కూలిపోతాడు” అని కుంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. న్యాయవాది దంపతులు హత్య కేసులో  ఇప్పటి వరకూ  పోలీసులు ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. కుంటా శ్రీను ‘కాల్ డేటా’ ను రామగుండం పోలీసులు విశ్లేషించారు .ప్రధాన నిందితుడు శ్రీనివాస్ కుంటా గతంలో ‘సింగరేణి కార్మిక సమాఖ్య’లో మిలిటెంట్ గా పని చేసినట్టు తెలుస్తోంది. గతంలో సికాసలో పనిచేసిన కుంట శ్రీనివాస్‌పై అనేక కబ్జా, బెదిరింపుల కేసులు  ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల అదుపులో నిందితులు

- Advertisement -

పెద్దపల్లి జిల్లాలో సంచలనం రేపిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  హత్య కేసులో నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవిలను పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న వామన్ రావు దంపతుల హత్య అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితులను పట్టుకున్నారు. వామన్ రావు తండ్రి ఫిర్యాదులో కుంట శ్రీనివాస్ తో పాటు కుమార్ హత్యకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా దర్యాప్తులో శ్రీనివాస్ తో పాటు చిరంజీవి దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. పోలీసు విచారణలో మరిన్ని విషయాలు బయట పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement