జూన్ 23నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు బిజెపి నేతలు. తాజా పరిస్థితులపై హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో పలువురు అధికారులు సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ నెలాఖరున రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. ప్రధాని టూర్ ను సైతం రెట్టింపు ఉత్సాహంతో సక్సెస్ చేయాలని నిర్ణయించారు. జూలై 12 వరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు చివరి లోపు నాలుగో విడతని సైతం పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మూడు, నాలుగో విడత పాదయాత్రలు వరంగల్, ఖమ్మం, నల్గొండ, జిల్లాల్లో జరగనుంది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా సంగ్రామ యాత్ర సాగనుంది. ఈ మేరకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement