పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులుఏ 1 నిందితుడైన బి జె పి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కి 14 రోజుల కస్టడీ కి విధించడంతో ఆయనను బుధవారం రాత్రి 10 గంటలకు హన్మకొండ నుండి కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ సందర్బంగా కరీంనగర్ జైలు వద్ద పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో బారి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్ వెంట వచ్చిన వాహనాలను జైలు ఆవరణలో నిలిపివేసి సంజయ్ ని జైలుకు తీసుకెళ్లారు.
.బిజెపి నాయకులు, కార్యకర్తలు ఎవరిని జైలు పరిసర ప్రాంతాల్లోకి అనుమతించలేదు. సంజయ్ తో పాటు ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులుగా ఉన్న ప్రశాంత్, మహేష్, శివ గణేష్ లను కూడా కరీంనగర్ జైలుకు తరలించారు కాగా సంజయ్ తినే ఆహారాన్ని పరీక్షించి ఇవ్వాలని నాయవదులు కోరారు సంజయ్ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడగా వరంగల్ పోలీస్ లు కస్టడీ కోరనున్నారు.
. .