బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌ను ఇవ్వాల పోలీసులు గృహ నిర్బంధం చేశారు. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై ఆందోళనలకు ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా సంజయ్ జేబీఎస్లో ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బండి జేబీఎస్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. బస్ చార్జీల పెంపుపై ధర్నాలు చేసి తీరుతామన్న బీజేపీ నేతలు చెబుతున్నారు.
కాగా, చార్జీల పెంపుపై నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల బాధలు తెలుసుకోవడం నేరమా?, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు.. అరెస్టులు, అణిచివేతలతో ఉద్యమాలను ఆపలేరు అంటూ పోలీసులపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.