హైదరాబాద్ – ఉగ్రవాదులకు ఎంఐఎం పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.. మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఉగ్రవాదులకు సపోర్ట్గా ఓ వైసీ మాట్లాడారని గుర్తు చేశారు. పాతబస్తీలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని..ఇందులో ఓ వ్యక్తి ఓవైసీ చెందిన కాలేజీలో హెచ్ వోడీగా పనిచేస్తున్నాడని వివరించారు.. అలాగే ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని మండిపడ్డారు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాద సంస్థలను ఎంఐఎం వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ వాడుకుంటోందని అన్నారు.. కాంగ్రెస్ , బీఆర్ఎస్ కు అధికారమే కావాలని…..ప్రజల భద్రత అవసరం లేదన్నారు. హైదరాబాద్ లోని ప్రజల ప్రాణాలు బాంబుల మీదున్నాయని అంటూ హైదరాబాద్ ప్రజల భద్రతను బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని , ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బండి కోరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement