Friday, November 22, 2024

చంద్ర‌బాబు అరెస్ట్ ను త‌ప్ప‌ప‌ట్టిన బండి సంజ‌య్ …

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిన విధానం సరైందికాదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement