Friday, October 18, 2024

Comments On Budget ఇది నిజంగా గాడిద గుడ్డు బ‌డ్జెట్టే – బండి సంజ‌య్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ ప్ర‌తినిధి – గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో… కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతే నిజమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నేడు ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయ‌న మాట్లాడుతూ, తెలంగాణ ఆర్థిక మంత్రి చదివింది బడ్జెట్టా? అప్పుల పత్రమా? అన్నది అర్థం కావడం లేదన్నారు. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో బడ్జెట్‌లో చూపలేదని విమర్శించారు. ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే హామీల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదని తెలుస్తోందన్నారు.

‘కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?. గాడిద గుడ్డు పెట్టం ఎంత నిజమో.. కాంగ్రెస్ హామీల అమలు అంతే నిజమనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం. ఆరు గ్యారంటీలకు బడ్జెట్ లో నిధులెందుకు కేటాయించలేదు. ఆరు గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా కేంద్రాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారా? కేటాయింపులకు సరిపడా ఆదాయం ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తారో బడ్జెట్ లో చూపకపోవడం విడ్డూరం. రూ. లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కేటాయించని కాంగ్రెస్ నేతలా కేంద్రంపై విమర్శలు చేసేది? హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ కు మాటలు ఎక్కువని బడ్జెట్ చూస్తే అర్థమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడతారా?’ అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement