Friday, September 6, 2024

Bandi Comments కాంగ్రెస్ ది గాడిద గుడ్డు బ‌డ్జెట్

ధ్వ‌జ‌మెత్తిన కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్
64 మంది ఎమ్మెల్యే, 8మంది ఎంపీలు గాడిద గుడ్లే
కాంగ్రెస్, బిఆర్ఎస్ లు అవ‌కాశ వాద పార్టీలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న నేడు ఎక్స్ లో ట్విట్ చేశారు.

- Advertisement -

ఇక తెలంగాణ బ‌డ్జెట్ పై అంశాన్ని ప్ర‌స్తావిస్తూ, , కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు… అన్నీ గాడిద గుడ్డే అన్నారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలూ గాడిద గుడ్డే అన్నారు. నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడం దుర్మార్గమన్నారు. భారత్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతమే లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం జరుగుతుందన్నారు.

ఈ రెండు అవ‌కాశ‌వాద పార్టీలే

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవకాశవాద పార్టీలు అని విమర్శించారు. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇక అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement