Friday, November 22, 2024

ఎంపీ ప‌ద‌వికి బండ ప్రకాష్ రాజీనామా.. 6న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

కరీమాబాద్ (ప్రభ న్యూస్): తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్ట‌ర్ బండా ప్రకాష్ తన ఎంపీ పదవికి గురువారం రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇతర సహచర ఎంపీల‌తో కలిసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు తన రాజీనామా లేఖను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచ‌న‌ల మేరకు ఎమ్మెల్సీగా ఎన్నికైనందున రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ నెల 6న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement