Friday, November 22, 2024

చైతన్య పాఠశాలను బ్యాన్ చెయ్యండి – AISF

జగిత్యాల పట్టణ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చైతన్య పాఠశాల ముందు విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్రమ్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా చైతన్య పాఠశాల నిబంధన విరుద్ధంగా నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారని మండిపడ్డారు. పూర్తి ఆధారాలతో జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కనీస చర్యలు తీసుకోలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. చైతన్య పాఠశాల పేరు మీద అనుమతులు ఉంటే శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ పేరు మీద పాఠశాలను నడుపుతూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ య‌ధేచ్ఛగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఆకర్షిస్తూ ముందస్తుగా అడ్మిషన్లు నడుస్తున్నాయని, అదేవిధంగా నూర్ మజీద్ పక్కన నూతన బిల్డింగ్ కూడా తీసుకుని అడ్మిషన్లు చేస్తున్నారని, రెండు పూటల బడి నిర్వహణ సంబంధించి ప్రజావాణిలో కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ పర్యవేక్షణ పూర్తీగా కరువై పోయిందని, డీఈఓ కు ఏమైనా వాటలున్నాయా అన్నారు. ప్రీతి కార్పోరేట్ పాఠశాల యాజమాన్యం పైన ఈ రోజు యధేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్వ్యూ లు నడుస్తున్నా కనీసం ఫోన్ ద్వారా సమాచారం అందించాలన్నా స్పందించలేదని వాపోయారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి గాయత్రి స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఇంటర్వ్యూలకు వచ్చిన అభ్యర్థులను పంపాల‌ని ఆదేశించడంతో వారు వెళ్లిన అనంతరం అక్కడి నుంచి AISF నాయకులు ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో AISF పట్టణ‌ అద్యక్షులు శివ సాయి రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, బచ్చల రమేష్ లు, సహయ కార్యద‌ర్శులు వంశీ, పవన్, నాయకులూ రిజ్వాన్ షారుక్, అజయ్, విష్ణు, మనోజ్, ఎస్ ఎఫ్ ఐ పట్టణ కన్వీనర్
బచ్చాల వినోద్, వరుణ్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement