Tuesday, November 26, 2024

Campaign Start – శివాలయం లో ప్రత్యేక పూజలు… ప్ర‌చారానికి బాల్క సుమ‌న్ శ్రీకారం ..

చెన్నూర్ అక్టోబర్ 28(ప్రభ న్యూస్) చెన్నూరు నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ శనివారం నియోజకవర్గ కేంద్రంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత స్థానిక శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణం లోని ప్రధాన వీధులలోని వ్యాపారులను కలిసి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని వివరించి మరికొద్ది రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో తనకు ఓటేయాల‌ని ఓట‌ర్లను అభ్య‌ర్ధించారు.

కాంగ్రెస్ దొంగ హామీలను ప్రజలు నమ్మరు

ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా, ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తెలియజేశారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నరన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరు గ్యారెంటీ స్కీములని కాంగ్రెస్ ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తున్నా వారు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతు బీమా, బీసీ బందు, మైనార్టీ బందు, దళిత బంధు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు లాంటి ఒక్క పథకం కూడా ఎందుకు అమలు చేయడం లేదన్నారు. మొండి చేతికి ఓటు వేస్తే తిరిగి కరెంటు, నీటి కష్టాలు వస్తాయన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం లో ఏమి అభివృద్ధి చేశారన్నారు.

- Advertisement -

రెండేళ్ల పాటు కరోనా విపత్కర పరిస్థితులు ఉన్నా నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామన్నారు. సీఎం కేసీఆర్ దార్షనికతతో మంచిర్యాల జిల్లా అయిందన్నారు. హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, చెన్నూరు నియోజకవర్గంలో కూడా ప్రజలు గులాబీ పార్టీ వైపే ఉన్నారన్నారు. బారాస ఎన్నికల మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బిజెపి లు ఖంగుతిన్నాయని, వారికి ఓటమి కళ్ళ ముందు కనబడుతుందన్నారు. ఒక్క చెన్నూరు పట్టణంలోనే 200 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయ న్నారు. ఈ కార్యక్రమంలో బారాస ప్రజా ప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement