Monday, November 25, 2024

TS: అక్ర‌మ‌నిర్మాణంపై బ‌ల్దియా కొర‌డా.. వ‌ర్ణం షాపింగ్‌మాల్ కూల్చివేత‌..

అక్ర‌మ నిర్మాణాల‌పై బ‌ల్దియా అధికారులు కొర‌డా ఝలుపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ లోని వరంగల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన‌ వర్ణం షాపింగ్ మాల్ భవనంనుబల్దియా అధికారులు ఈ తెల్ల‌వారు జామునా తొల‌గిస్తున్నారు.

ఇప్పటి వరకూ అకుపెన్సి సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్య కలాపాలు నిర్వహిస్తూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేశారు. నిబంధనల కు విరుద్ధమైన భవనాలు ఉంటే తీసేయాలంటూ సిటీ ప్లానర్ బానో తు వెంకన్న ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చి వేసే దాకా వేచి చూడొద్దని హెచ్చ రించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఏ ఒక్కరిని ఉపేక్షించ‌బోమ‌న్నారు. పలు షాపింగ్ మాల్స్ లలో స్టిల్ట్ కొరకు నిర్మించిన దానిలో పార్కింగ్ కు కాకుండా నిర్మాణాలు ఉన్నట్లైతే వెంటనే తొలగించుకోవాలని సూచించారు. తమ బృందం వచ్చి కూల్చే అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు. వర్ణం అక్రమ కూల్చి వేత పనులు ఇంకా కొన సాగుతూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement