Thursday, October 31, 2024

TS:నేడు బ‌ల్దియా స‌మావేశం..23 ప్రశ్నలతో రెడీ…

ఇవాళ జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం జ‌గ‌నుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ కౌన్సిల్‌ సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. అన్ని పార్టీలకు చెందిన 147 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌ ఆఫిషియో సభ్యులు పాల్గొని ప్రజా సమస్యలపై గళం విప్పనున్నారు. డిసెంబర్‌ మొద టి వారం తర్వాత జరగాల్సిన కౌన్సిల్‌ సమావేశం కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ వైఖరితో జాప్యం జరిగింది.

చివరకు మేయర్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయ డం..బీజేపీ కార్పొరేటర్‌ శ్రవణ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటి చర్యలతో వెనువెంటనే కౌన్సిల్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మొత్తం గా గడిచిన ఐదు నెలలుగా అభివృద్ధి పనులు అటకెక్కడం, కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, అపరిష్కృత సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశం వైపు ఎదురుచూసిన పరిస్థితి. నేటి కౌన్సిల్‌ సమావేశం వాడీవాడీగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

స్వల్ప మార్పులతో…
జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 54, ఎంఐఎం 42, బీజేపీ 40, కాంగ్రెస్‌ 11 (మూడు డివిజన్లలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది) మంది ఉండగా…అన్ని పార్టీలకు కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. 11 మంది సభ్యులున్న అధికార పార్టీ కాంగ్రెస్‌ కార్పొరేటర్లతో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లకు ప్రజల సమస్యలపై మాట్లాడనున్నారు. 23 ప్రశ్నలతో సభ్యులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధానంగా శానిటేషన్‌, రాంకీ నిర్వహణ, వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అక్రమాలు, జీహెచ్‌ఎంసీకి భారంగా మారుతున్న డిప్యూటేషన్లు, స్విపింగ్‌ యంత్రాల్లో జరుగుతున్న అవినీతి, ప్రకటనల విభాగంలో, సీఆర్‌ఎంపీ రోడ్ల నిర్వహణ, ట్యాక్స్‌ (రెవెన్యూ)లో, టౌన్‌ప్లానింగ్‌, నాలాల అక్రమణలపై అధికారుల లోపాలను ఎత్తిచూపనున్నారు. అయితే సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు ఏ మేరకు సమాధానం చెబుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. సమావేశం సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉండగా..చివరలో బడ్జెట్‌పై సుదీర్ఘంగా చర్చించి ఆమోదించనున్నారు. కాగా, కౌన్సిల్‌లో సభ్యులు కూర్చునే సీటింగ్‌ కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్‌ సభ్యులకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది వరకు ముగ్గురు సభ్యులు మాత్రమే ఆ పార్టీకి ఉండగా.. తాజాగా చేరికలతో 11 మంది వరకు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో ఆ పార్టీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement