వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యం లో వరంగల్ డయాబెటిక్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా రేపు ఉచిత మెగా డయాబెటిక్ స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా ఇంచార్జి అదనపు కమిషనర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇండోర్ స్టేడియం,హన్మకొండ నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయంలో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆదివారం ఉదయం 7 గం. ల నుండి మధ్యాహ్నం 3.గం. వరకు డాక్టర్ల సేవలు అందుబాటులో ఉండి డయాబెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహిస్తారన్నారు. ఇట్టి ఉచిత హెల్త్ క్యాంప్ ను బల్దియా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు,సిబ్బంది సద్వినియోగం చేసుకోని డయాబెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేయించుకోవాలని ఆమె కోరారు.