Tuesday, November 26, 2024

బాలకృష్ణ డైలాగ్ తో ట్రోలర్స్ కి బుద్ది చెప్పిన.. మంత్రి కేటీఆర్ తనయుడు

మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు హీరో నందమూరి బాలకృష్ణ డైలాగ్ తో తనని కామెంట్ చేసిన వారికి సమాధానం ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు గతంలో అధిక బరువు సమస్యల కారణంగా ట్రోలింగ్స్ కి గురయ్యారు. అతడి లావైన శరీరాకృతి కారణంగా బాడీ షేమింగ్ కి గురయ్యారు. కేటీఆర్ కూడా కొడుకు బరువు కారణంగా పలు సందర్భాల్లో ప్రభావితమయ్యారు. తన కొడుకుపై రేవంత్ రెడ్డి విమర్శల గురించి బహిరంగంగా మాట్లాడారు. తన కుమారుడిపై కొందరు అసభ్యకరమైన వ్యక్తులు ఎలా వ్యాఖ్యలు చేశారో ఆయన ప్రస్తావించారు. అయితే విమర్శించిన వారికే షాకిచ్చేలా హిమాన్షు తయారయ్యారు. హిమాన్షు ఎక్సర్ సైజులు చేసి మరీ స్లిమ్ అయ్యారు. భారీ మేక్ఓవర్ తో ట్రోలర్లను తిరిగి ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ హిమాన్షు లేటెస్ట్ ఫొటోను పోస్ట్ చేసి అతను తన తండ్రి కేటీఆర్ చిన్న వెర్షన్లా కనిపిస్తున్నాడని రాశాడు. అది గమనించిన హిమాన్షు ట్విటర్ లో రీట్వీట్ చేసి ప్రముఖ బాలకృష్ణ డైలాగ్ తో రిప్లై ఇచ్చారు. ‘ఒక గొప్ప వ్యక్తి ఒకసారి చెప్పారు.. సరిసరిలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతున్నాయా ఏంటి” అంటూ బాలయ్య డైలాగ్ ను హిమాన్షు ట్వీట్ చేశారు. ‘జోకులు వేరు.. ధన్యవాదాలు!” అంటూ ముగించారు. ఈ పోస్ట్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు. వారిలో కొందరు హిమాన్షు ఇంతలా సన్నబడడానికి.. తన అద్భుతమైన మేక్ఓవర్ వెనుక రహస్యాన్ని వెల్లడించమని కోరారు.ఒక్కటి మాత్రం నిజం కెటిఆర్ మాత్రం తన కొడుకు ఇంతలా సన్నబడి స్మార్ట్ గా అవ్వడానికి గల కారణాలు వెతుకుతుంటారు. ఇప్పుడు గొప్ప షేప్లో కనిపిస్తున్నందున.. బరువు తగ్గిపోయినందుకు విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చినందుకు ఆనందపడుతూ ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement