Tuesday, January 7, 2025

Bail Sanctioned – అల్లు అర్జున్ కు బిగ్ రిలీష్ – రెగ్యులర్ బెయిల్ మంజూరు

హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ ల‌భించింది.. ఆయ‌న దాఖ‌లు చేసిన రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ ను విచారించిన నాంపల్లి కోర్టు అత‌నికి బెయిల్ మంజూరు చేసింది. . సంధ్య థియేటర్ ఘటనలో బన్నీపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. అదే రోజు ఆయ‌న‌కు కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది.. అనంత‌రం బ‌న్నీ పూర్తి బెయిల్ కోసం నాంప‌ల్లి కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు.. ఇరు వైపుల వాద‌న‌ల విన్న న్యాయ‌మూర్తి కొన్ని కండిష‌న్ తో బెయిల్ మంజూరు చేశార‌. రూ. 50 వేలు ద‌ర‌వ‌త్తుతో పాటు ఇద్ద‌రు వ్య‌క్తుల ష్యూరిటితో బెయిల్ ను మంజూరు చేస్తున‌ట్లు న్యాయస్థానం పేర్కొంది.. విచార‌ణ‌కు పోలీసులకు స‌హ‌క‌రించాల‌ని, ఎప్పుడు పిలిచినా విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని అల్లు అర్జున్ ను కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement