Monday, December 23, 2024

Bail Rejected : మోహ‌న్ బాబు అరెస్ట్ త‌ప్ప‌దా…?

సినీ నటుడు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. కాగా జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఆయన కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. దేశం విడిచి వెళ్లిపోయారని ప్రచారం సైతం అయింది. అయితే మోహన్ బాబు తరపున లాయర్లు వెంటనే స్పందించారు. మోహన్ బాబు ఎక్కడికి వెళ్లలేదని తెలిపారు.

కాగా మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు జరిగాయి. మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య గొడవ జరిగింది. ఇదంతా జల్ పల్లి నివాసంలో జరిగింది. అయితే న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన నేపథ్యంలో జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement