Wednesday, September 18, 2024

Bail – సుప్రీంలోనూ కవితకు నిరాశ

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయా లంటూ ప్రతివాదులుగా ఉన్న ఈడీ, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటీషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో వాదాపవాదనలు జరి గాయి. ఆమె బెయిల్‌పై ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కవిత తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. కేసు మొదలైన నుంచి ఇప్పటివరకు జరిగిన తీరును న్యాయవాదులు వివరించారు.

వాదనలు విన్న ధర్మాసనం ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ తదుపరి విచారణను ఆగష్టు 20కి వాయిదా వేసింది.ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై ఒకటిన తీర్పు ఇచ్చింది. దీన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement