Saturday, September 21, 2024

Bail Hearing – మ‌ళ్లీ క‌వితకు నిరాశే

బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా
కౌంట‌ర్ కు స‌మ‌యం కావాల‌న్న సిబిఐ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత బెయిల్ పిటిష‌న్ విచార‌ణ మ‌రోసారి వాయిదా ప‌డింది.. ఈ కేసులో గ‌త అయిదు నెల‌లుగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జ‌రిగింది. ఈ పిటిషన్ ను జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది..

- Advertisement -

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకు ఇచ్చిన‌ట్లే క‌విత‌కు ఇవ్వాల‌ని వాద‌న‌లు వినిపించారు సీనియ‌ర్ లాయ‌ర్ ముకుల్ రోహ‌త్గీ. బెయిల్ పిటిషన్ పై కౌంట‌ర్ ఫైల్ దాఖలు చేసింది సీబీఐ. ఇదే సమయంలో కౌంట‌ర్ ఫైల్ చేసేందుకు గురువారం వ‌ర‌కు స‌మ‌యం ఈడీ తరుపు న్యాయవాది కోరారు. దీంతో విచార‌ణ‌ను ఈ నెల 27 కి వాయిదా వేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement