Thursday, November 7, 2024

TG: కవితకు బెయిల్.. రేవంత్ పై సుప్రీం సీరియస్..

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ రోజు ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తవనకు వచ్చింది. రేవంత్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎం కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలిటికల్ కామెంట్స్‌కు తాము భయపడమని స్పష్టం చేసింది. మా డ్యూటీ మేం చేస్తామని తెలిపింది.

ఈరోజు ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ రావడంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు 16 నెలల తర్వాత బెయిల్ వచ్చిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. కవితకు త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందని అనుమానం వ్యక్తం చేశారు రేవంత్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement