Monday, November 18, 2024

BAC Meeting – మంత్రి శ్రీధ‌ర్ అభ్యంత‌రం… బిఎసి నుంచి హ‌రిష్ నిష్క్ర‌మ‌ణ‌…

హైద‌రాబాద్ – అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. గవ‌ర్న‌ర్ ప్ర‌సంగం అనంత‌రం రేప‌టికి స‌భ వాయిదా ప‌డింది..అనంత‌రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతను బీఏసీ సమావేశం నిర్వ‌హించారు..బీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కడియం శ్రీహరి, అక్బరుద్దీన్ ఓవైసీ, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే బీఏసీ సమావేశానికి కేసీఆర్ బదులుగా హరీష్ రావు రావడంపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన బదులుగా హరీష్ రావు బీఏసీకి వస్తారని ముందే కేసీఆర్ స్పీక‌ర్ కు సమాచారం ఇచ్చార‌ని హరీష్ తెలిపారు.. అయినా శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పడంతో బీఏసీ నుంచి హరీష్ రావు బయటకు వచ్చేశారు.

ముందే అనుమ‌తి తీసుకున్నా….హ‌రీష్ రావు
బీఏసీ నుంచి బయటకు రావడంపై మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ అనుమతితోనే బీఏసీకి వెళ్లానన్నారు. బీఏసీకి వెళ్లడంపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారని వారు అభ్యంతరం తెలపడంతో వారి విజ్ఞతకు వదిలేసి బయటకు వచ్చేశానన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి కనీసం మంత్రులు కూడా వెళ్లడం లేదన్నారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో అన్నీ అబ‌ద్దాలే..

ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేశామని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించార‌న్నారు హ‌రీష్ రావు . ఆరోగ్యశ్రీ గురించి గవర్నర్‌తో ఎందుకు చెప్పించలేదన్నారు. ఆశగా ఎదురు చూసిన ఆసరా పింఛన్ దారులకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందన్నారు. మహాలక్ష్మీ కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రైతులకు బోనస్ ఇచ్చే విషయంపై ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. నిరుద్యోగులకు రూ.4వేలు ఇచ్చే విషయాన్ని ప్రస్తావించలేదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement