Tuesday, November 19, 2024

Nizamabad | ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా?

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ నవజాత శిశు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీకి చెందిన దీక్ష కాంబ్లే పురిటి నొప్పులతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డిసెంబర్ 12న పండంటి పాపకు జన్మనిచ్చింది. పుట్టిన పాప పూర్తి ఆరోగ్యంగా ఉందని వైద్యులు దృవీకరించడంతో సంతోష్, దీక్ష దంపతులు ఎంతో సంతోషపడ్డారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పాపతో డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది.. డిసెంబర్ 28న పాప చేతి వేలికి.. వాపు రావడంతో ఆందోళన చెందిన దంపతులు నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యం సక్రమంగా లేకపోవడంతో పాత ఆర్డిఓ ఆఫీస్ ప్రాంతంలో ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

సదరు వైద్యులు పాప చేతివేలుకు ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు.. రెండు రోజులు వైద్యం అందించిన ఆ వైద్యుడు.. 29న రాత్రి 12 గంటల సమయంలో తన సొంత కారులోనే.. వీక్లీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ప్రవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి.. డాక్టర్ తో మాట్లాడి అడ్మిట్ చేశారు… మరో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడు పాపకు వెంటిలేటర్ ద్వారా వైద్యం అందించారు.. ఈ నెల 2న సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాప చనిపోయిందని వైద్యు డు.. పాప తల్లిదండ్రులకు చెప్పారు..

ఫీజు కడితేనే పాప మృతదేహాన్ని ఇస్తామన్న వైద్యుడు…

- Advertisement -

పాప చనిపోయిందని బాధపడుతున్న తల్లిదండ్రులకు మరో పిడుగు పడ్డట్లయింది. సుమారు .. 90వేల రూపా యల వరకు ఆసుపత్రిలో పాప వైద్యం కోసం ఫీజు కట్టారు. మరో రూ25 వేలు ఇస్తేనే పాప మృత దేహాన్ని ఇస్తామని వైద్యుడు చెప్పారు. ఇప్పటికే డబ్బులు కట్టామని మా దగ్గర అంతగా డబ్బులు లేవని బ్రతి మిలాడిన సదరు వైద్యుడు వినుకోలేదు. చివరకు ప్రజా సంఘాల నాయకులు చొరవ తీసుకొని వైద్యుడు తో మాట్లా డగా పాప మృతుదేహాన్ని పాప తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇప్పటికైనా పాప మృతి పై ముగ్గురు వైద్యులు అందించిన వైద్యంపై ఉన్నతాధికారులు చొరవ తీసుకొని విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి. అలాగే పాప కుటుం బ సభ్యులకు న్యాయం జరుగు తుందని ప్రజా సంఘాల నాయ కులు తెలిపారు.ఇలాంటి ఘట నలు జరగకుండా అవకాశం ఉంటుందన్నారు.అంతేకాకుండా ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ప్రజాసంఘాలు వినతిపత్రం ఇవ్వడంతో పాటు పాప మృతి కారణమైన ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు.

బ్రెయిన్ డ్యామేజ్, బరువు తగ్గడం ఇతరత్రా సమ స్యలతోనే

ఈ నెల29న రాత్రి ఒకటి గంట సమయంలో పాపను మా ఆస్పత్రిలో తీసుకువచ్చారని ప్రైవేట్ వైద్యులు తెలిపారు. పాపను పూర్తిగా పరీక్షించి అడ్మిట్ చేసుకున్నానని చెప్పారు. మరు సటి రోజు పాప కండిషన్ బాగాలేదని సదరు పాప తల్లిదండ్రులకు బంధు వులకు తెలిపినట్లు తెలిపారు. పాపకు బ్రెయిన్ డ్యామేజ్, లివర్, బరువు తగ్గడం ప్రధాన సమస్యలు ఉన్నాయని పేర్కొ న్నారు. వెంటిలేటర్ ద్వారా వైద్యం అందిస్తూనే పాప తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు పాపకు అందిస్తున్న వైద్యానికి సంబంధించిన పూర్తి సమా చారాన్ని వివరించినట్లు తెలి పారు. మంగళవారం సాయం త్రం 4 గంటల సమయంలో పాప చనిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement