హైదరాబాద్ : ఒక వైపు మద్యం, ఇంకో వైపు బుల్లెట్ పై జోరు, అంతలోనే ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే దుర్మరణం. ఈ ఘటన హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీ 100 అడుగుల రోడ్డులో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్ లు పూర్తిగా మద్యం సేవించి తూగుతూ బుల్లెట్ పై మాదాపూర్ నుంచి బోరబండకు బయల్దేరారు.
మద్యం నిషా తలకెక్కడంతో బుల్లెట్ ను పూర్తి స్పీడుగా నడపడంతో అదుపుతప్పి ఆ మార్గంలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -