Monday, November 18, 2024

బాలల హక్కుల రక్షణపై అవగాహన సదస్సు

నాగిరెడ్డిపేట్: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో బాలల హక్కుల వారోత్సవాలు భాగంగా భేటి బచావో భేటి పడావో అనే నినాదంతో బాలల హక్కుల రక్షణ కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల విద్యార్థులతో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేసారు. ఈ సమావేశంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు దత్తు, మాలోత్‌ వెూహన్ లు జిల్లా బాలల పరిరక్షణ విభాగం తరపున పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై పిల్లలకు మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

నాగిరెడ్డిపేట్‌ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయనున్నారు. జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాద్యాయులు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని కోరారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమ‌ని అన్నారు. మంచిగా స్థిరపడిన అనంతరం పెళ్ళిలు చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల్లోపు బాలికలు 21 సంవత్సరాల్లోపు బాలురు పెళ్లి చేసుకోకూడదు, బాల్య వివాహాలు వలన కలిగే అనర్ధాలు గురించి, లైంగిక వేధింపుల వలన కలిగే అనర్ధాలు గురించి ఉదాహరణలతో సహా వివరించారు.

బాలలు అత్య‌వ‌స‌ర‌ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో పిల్లల రక్షణ కోసం 1098 ఉచిత ఫోన్‌ నంబర్‌ 24 గంటలు పనిచేస్తుందన్నారు. బాలల హక్కుల గురించి ఎవరైనా పిర్యాదు చేయవచ్చని, భయపడాల్సిన అవసరం లేదని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. పిల్లల హక్కలకు భంగం కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్స్‌, విద్యార్ధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement