Tuesday, November 26, 2024

ప్లాస్టిక్ బ్యాన్ పై అవ‌గాహ‌న ర్యాలీ

దుండిగల్ వార్డ్ నందు మున్సిపల్ కమీషనర్ బుధ‌వారం ప్లాస్టిక్ బ్యాన్ పైన అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్ధాలను వివరించారు. ఈసంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ… దుండిగల్ మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటిగా చేయాలని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడవద్దన్నారు. 75 మైక్రాన్ కంటే ఎక్కువ కలిగిన ప్లాస్టిక్ ను మాత్రమే వాడాలన్నారు. అవగాహన కోసం వార్దుల్లో ప్లాస్టిక్ పైన అవగాహన సదస్సులను నిర్వ‌హించాల‌ని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఉపయోగించే “సింగల్ యూస్ ప్లాస్టిక్” వాడకూడదని.. మీరే కాకుండా మీ చుట్టుపక్కల వారు కూడా వాడకుండా చూడాలన్నారు.

అలా ప్లాస్టిక్ వాడిన వారికి “టాస్క్ ఫోర్సు కమిటి” వారు ప్లాస్టిక్ బ్యాన్ యాక్ట్, మునిసిపల్ యాక్ట్ -2019 ప్రకారం జరిమానా విధిస్తార‌ని సూచించారు. అదేవిధంగా దుండిగల్ నందు ప్లకార్డ్స్ పట్టుకొని “ప్లాస్టిక్ బ్యాన్” చేస్తూ ర్యాలీ ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠ‌శాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ పి.భోగిశ్వర్లు, కౌన్సిలర్ జక్కుల విజయా శ్రీనివాస్, సానిటరీ ఇన్ స్పెక్ట‌ర్స్, కరుణాకర్ రెడ్డి, ఎస్.విజయ్ భాస్కర్, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ సాత్విక్, సానిటరీ జవాన్స్, మహిళా ఆర్పీ, మహిళా పొదుపు సంఘం మహిళలు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement