నిజామాబాద్, (ప్రభన్యూస్) : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ – 2021 సంవత్సరంనకు జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం న్యూఢిల్లీలో ఐ.ఎం. ఎ. భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం – నీతి ఆయోగ్ సభ్యులు వి.కె.పౌల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా వివిధ విభాగాలలో పని చేసిన కృషిని గుర్తించి ప్రతియేటా యువ వైద్యులకు జాతీయ అవార్డులను ప్రధానం చేస్తారు.
ఈ సంవత్సరం ఐ.ఎం.ఎ. నిజామాబాద్ ఉపాధ్యక్షులు, పూర్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ వైద్య కళాశాల అసొసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ కు ఇవ్వడం జరిగింది అని ఆయన తెలిపారు. ఈ సంవత్సరంలో ఐ.ఎం.ఎ. ప్రధాన కార్యదర్శిగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్, కోవిడ్-19 ప్యాండమిక లో చేసిన టెలి మెడిసిన్, మత్తు పదార్థాలు ఆరోగ్యంపై చేసిన కృషికి గుర్తింపుగా ఖేతన్ దేశాయ్కు యువ లీడర్ అవార్డును న్యూడిల్లీలోని ఐ.ఎం.ఎ. భవన్ ఆడిటోరియంలో ప్రశంసా పత్రం మెవెూంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎం.ఎ. జాతీయ అధ్యక్షులు డా.జయ లాల్, ప్రధాన కార్యదర్శి డా.జయేష్ లీలే, వైద్యులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily