Friday, November 22, 2024

తెలంగాణ పోలీసులకు అవార్డుల పంట.. ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప తకాలను తెలంగాణ పోలీసులు సొంతం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ ఎం. భగవత్‌తో సహా 14మంది పోలీసు అధికారులు ఈ పతకాలు సాధించారు. నిఘా విభాగం ఎస్పీ దేవేందర్‌సింగ్‌ ప్రతిభావంతులైన సేవకు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని సాధించారు. డిటెక్టివ్‌ డిపార్‌ ్ట మెంట్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏఆర్‌. శ్రీనివాస్‌, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగం (సీఐడీ) అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ, ఎస్‌ఐబీ ఏఎస్పీ పైళ్ల శ్రీనివాస్‌, సెంట్రల్‌ జోన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సాయిని శ్రీనివాసరావు, అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ఎస్‌. వెంకట రమణమూర్తి, ఇంటలీజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, తెలంగాణ పోలీసు అకాడమీ డీఎస్పీ గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ రాజమౌళి, రాచకొండ స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఏస్సై కాట్రగడ్డ శ్రీనివాసులు, కామారెడ్డి రిజర్వ్‌ సబ్‌ ఇన్స్‌ పెక్టర్‌ జంగన్నగారి నీలంరెడ్డి, రాష్ట్ర స్పెషల్‌ పోలీసు నాలుగో బెటాలియన్‌ ఏఆర్‌ ఎస్సై సలేంద్ర సుధాకర్‌తోపాటు కరీంనగర్‌ ఇంటలీజెన్స్‌ డీఎస్పీ కార్యాలయ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉందింటి శ్రీనివాసులు ఈ అవార్డులను సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement