Friday, November 15, 2024

Auto Drivers Dharna – ప్రీ బ‌స్సుతో న‌ష్ట పోతున్నాం ….. ఆదుకోండి

ఇందిరా పార్క్ లో ఆటో డ్రైవ‌ర్ల మ‌హాధ‌ర్నా
డ్రైవ‌ర్ల‌కు సంఘీభావం ప్ర‌క‌టించిన బిఆర్ఎస్
ద‌ర్నాలో పాల్గొన్న కెటిఆర్

హైద‌రాబాద్ – త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఇందిరా పార్క్‌లో ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమం చేప‌ట్టారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సీఐటీయూ, ఏఐసీయూటీ, బీఆర్టీయూ, టీయూసీఐ, జీయూసీఐ, యూటీఏడీడబ్ల్యూఏ, టీఏడీఎస్ లాంటి సంఘాలు పాల్గొన్నాయి. అలాగే ఈ ధ‌ర్నాకు బిఆర్ ఎస్ సంపూర్ణ‌మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.. అలాగే ఆటో డ్రైవ‌ర్ల‌కు సంఘీభావం తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ‌ర్నాలో పాల్గొన్నారు.

ఇది ఇలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహా లక్ష్మి స్కీమ్ కు ముందు యావరేజ్ గా 1000 రూపాయలు సంపాదన ఉంటే.. ఇప్పుడు 500 కూడా సరిగ్గా రావడం లేదు అని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.. అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. యాప్ లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ విలర్లను నిషేధించాలని కోరారు. ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచి.. సాధారణ మరణాలకు వర్తింప చేయాలని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ జేఏసీ డిమాండ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement