మంచిర్యాల, డిసెంబర్ 3 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల సున్నంబట్టిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీసీసీ నస్పూర్ లోని గాంధీనగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఎండీ గౌస్ బాబా మృతిచెందాడు. మంచిర్యాల నుండి శ్రీరాంపూర్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు. ఈ కేసును మంచిర్యాల పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -